సినీ కార్మికుల కోసం రవితేజ ఇరవై లక్షలు ఆర్ధిక సహాయం

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు.

Update: 2020-03-29 08:52 GMT
Ravi Teja (File Photo)

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు.

ఇందులో ముందుగా మెగాస్టార్‌ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇ‍వ్వగా.. తాజాగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున రూ. కోటి విరాళం ప్రకటించారు. అంతేకాకుండా ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య, ఎన్టీఆర్ 25లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇరవై లక్షలు ఆర్ధికసహాయం ప్రకటించారు.ఇక కరోనా వైరస్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ పరిశ్రమలోని ప్రముఖులు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లు అర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు..

కరోనా వైరస్ ... చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు 195 దేశాలకి పైగా వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తునట్లు కేంద్ర ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. భారత్ లోనూ క్రమక్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 970 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందారు.



Tags:    

Similar News