ఇల్లును శుభ్రం చేసిన మెగా పవర్ స్టార్.. వారికి ఛాలెంజ్!
కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే..
కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ అభిమానులకి కరోనా పై అవగాహనా కల్పిస్తూ తమ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లోనే ఉంటూ భార్యలకు కూడా సాయం చేస్తున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ ఇంటి పనులు చేస్తూ వీడియోను పోస్టు చేశాడు. ఇంటి పనులు చేస్తూ భార్యకు సాయం చేసేవాడే రియల్ మ్యాన్ అంటూ...టాలీవుడ్ లో "బీ ది రియల్ మెన్" ఛాలంజ్ అనే ట్రెండ్ కి నాంది పలికారు.
ఇక ఈ వీడియోని ట్వీట్ చేస్తూ రాజమౌళికి సవాల్ విసిరాడు. దీనిని స్వీకరించిన రాజమౌళి చీపురు పట్టి ఇల్లు ఉడ్చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ లకి ఛాలెంజ్ విసిరారు..ఇక ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్ పూర్తి చేశాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాంచరణ్ బట్టలు సర్దేశారు.. ఇల్లు క్లీన్ చేస్తూ మొక్కలకి నీళ్లు పోసి.. సతీమణి ఉపాసనకు కాఫి కలిపిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఆ తరవాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోలు రానా, శర్వానంద్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి ఛాలెంజ్ విసిరారు రామ్ చరణ్.. ఇంట్లో పనులు చేయడాన్ని గర్వంగా భావిద్దాం. నిజమైన మగాళ్లుగా ఉందాం. మహిళలకు సాయం చేసి పని భారాన్ని పంచుకుందాం. బి ద రియల్ మ్యాన్ అంటూ చరణ్ పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం).. అనే చిత్రంలో నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది.
Done @ssrajamouli garu !!
— Ram Charan (@AlwaysRamCharan) April 21, 2020
Let's take pride in doing chores at home! Let's be real men and help the women by sharing the work load.#BetheREALMAN
I further nominate Trivikram garu, @RanveerOfficial, @RanaDaggubati and @ImSharwanand to take up the challenge. pic.twitter.com/ItQ0zNQOR8