నేచురల్ స్టార్ నానీ.. తన 'గ్యాంగ్' ఎవరో బయట పెట్టాడు. 'బామ్మ..వరలక్ష్మి..ప్రియ.. స్వాతి.. చిన్ను..' వీళ్లే నా గ్యాంగ్. నేనే వీళ్లకి లీడర్ అంటున్నాడు. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా హడావుడి ఇదంతా. వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నానీ చేస్తున్న కొత్త సినిమా ''నానీ'స్ గ్యాంగ్ లీడర్''. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు.
ఐదుగురు వేర్వేరు వయసున్న మహిళల మధ్య బ్యానాక్యులర్స్ పట్టుకుని ఉన్న గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు.. నానీ గ్యాంగ్ లీడర్ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచీ అసలు గ్యాంగ్ ఎవరు? నానీ ఏం చేయబోతున్నాడు? అనుకుంటున్న అభిమానులకు ఫస్ట్ లుక్ కొంత క్లారిటీ ఇచ్చినట్టైంది. కథానుగుణంగా ఉన్న 'నాని'స్ గ్యాంగ్ లీడర్' ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.