దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై తెలుగు చిత్రసీమ స్పందన

దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలిసుల చర్యలను అభినందిస్తున్నారు.

Update: 2019-12-06 05:31 GMT
Telugu film industry response on disha rape accused encounter

షాద్ నగర్ హత్య కేసులో నిందితులైన నలుగురిని ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలిసుల చర్యలను అభినందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ పై తెలుగు చిత్రసీమ స్పందించింది.

గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. ఇక విచారణలో భాగంగా దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

 











Tags:    

Similar News