69th National Film Awards: మొదటిసారి తెలుగు నటుడికి నేషనల్ అవార్డు.. RRR సినిమాకు జాతీయ అవార్డుల పంట..!

69th National Film Awards: తెలుగు సినిమాలకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పంట పండింది.

Update: 2023-08-24 12:43 GMT

69th National Film Awards: మొదటిసారి తెలుగు నటుడికి నేషనల్ అవార్డు.. RRR సినిమాకు జాతీయ అవార్డుల పంట..!

69th National Film Awards: తెలుగు సినిమాలకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పంట పండింది. మొత్తం 11 అవార్డులను తెలుగు చిత్రాలు గెలుచుకున్నాయి. ఇప్పటికే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి స్టంట్ కొరియోగ‍్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మేల్ సింగర్, కొరియోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్ తదితర కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. అలానే ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

68 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడు అవార్డు తొలిసారి తెలుగు హీరోను వరించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, సూర్య, ధనుష్‌, శింబు, ఆర్య, జోజు జార్జ్‌ పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కు నెడుతూ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తగ్గేదే లే అంటూ ఈ అవార్డు ఎగరేసుకుపోయాడు.

తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డులు

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప: ది రైజ్‌)

ఉత్తమ చిత్రం - ఉప్పెన

ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ) - కింగ్‌ సాల్మన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

 ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - వి.శ్రీనివాస్‌ మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ లిరిక్స్‌- చంద్రబోస్‌ (ధమ్‌ ధమా ధమ్‌- కొండపొలం)

ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌(సాంగ్స్‌) - దేవి శ్రీప్రసాద్‌ (పుష్ప 1)

ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బ్యాగ్రౌండ్‌ స్కోర్‌) - ఎమ్‌ఎమ్‌ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్‌ఆర్‌ఆర్‌)

 బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ప్రొవైడింగ్‌ వోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ - ఆర్‌ఆర్‌ఆర్‌

బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు

Tags:    

Similar News