అసభ్య పదజాలంతో వేధిస్తున్నారు: కరాటే కళ్యాణి
సినీ నటి కరాటే కళ్యాణి అంటే తెలియని వారు ఉండరు. హాస్యప్రధానమైన చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తూ పాపులర్ అయింది.
సినీ నటి కరాటే కళ్యాణి అంటే తెలియని వారు ఉండరు. హాస్యప్రధానమైన చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తూ పాపులర్ అయింది. కృష్ణ, మిరపకాయ్ చిత్రాలు ఆమెకి నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. అయితే అసభ్య పదజాలంతో, అశ్లీల వీడియోలతో వేధిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ఆమె.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయాన్నే ఫోన్ చూడాలంటే భయంగా ఉందని, కొన్ని నంబర్స్ ని బ్లాక్ చేసినప్పటికీ కొత్త నంబర్స్ నుంచి వేధిస్తున్నారని ఆమె అందులో పేర్కొన్నారు.
అంతేకాకుండా తన ఫోటోలను మర్పింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారని, ఇవి తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే రీతిలో ఉన్నాయని, కావాలనే తనని నిందితులు టార్గెట్ చేశారని ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇప్పటివరకు నటిమనులపైన ఇలాంటివి కొనసాగేవి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వంతు అన్నట్టుగా ఉంది.