గోవాలో బ్రహ్మాజీ త‌న‌యుడి వివాహం

బోపాల్ కుటుంబానికి చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్ కుమార్తె అనుకృతి దీక్షిత్‌ను బ్రహ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ వివాహం

Update: 2019-12-01 16:53 GMT
sanjay marriage

తెలుగు చిత్రపరిశ్రమలో స‌పోర్టింగ్ క్యారెక్టర్స్‌ చేస్తూ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బ్రహ్మాజీ .. 30 ఏళ్ళు తన సినీ ప్రయాణంలో చాలా సినిమాలు చేసి అవార్డులను గెలుచుకున్నారు. తాజాగా అయన త‌న‌యుడి వివాహం గోవాలో నిర్వహించారు...

బోపాల్ కుటుంబానికి చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్ కుమార్తె అనుకృతి దీక్షిత్‌ను బ్రహ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు సంజయ్ స్నేహితులు హాజరయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా సైరా సినిమాలో నటించి మెప్పించాడు బ్రహ్మాజీ .. త్వరలో సంజయ్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. సంజయ్ చేసిన సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్దం అవుతుంది. 


Delete Edit


Tags:    

Similar News