షేక్ హ్యాండ్‌ వద్దు.. నమస్కారం ముద్దు : విజయ్ దేవరకొండ

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది.

Update: 2020-03-10 15:07 GMT
Vijay devarakonda

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. ఇక భారత్ లోకి క్రమక్రమంగా ఈ వ్యాది విస్తరిస్తుంది. దీనితో భారత్‌లో కరోనా కేసులు సంఖ్య 56కు చేరుకున్నాయి. కేరళలో ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్ణాటకలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణాలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.

అయితే కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ప్రత్యేకమైన వీడియోను చేసి విడుదల చేసింది. దీనిని విజయ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోలో విజయ్ మాట్లాడుతూ.. " కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించాడు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అది మన దారిదపుల్లోకి కూడా రాదని చెప్పుకొచ్చాడు.. ఇక షేక్ హ్యాండ్‌లు ఇవ్వొద్దని, పద్ధతిగా నమస్కారం పెట్టాలని విజయ్ సూచించాడు.

తరుచుగా సబ్బుతో చేతిని వాష్ చేసుకోవాలని రద్దీగా ఉన్న ప్రాంతాలలోకి వెళ్ళకూడదని వెల్లడించాడు. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే 104 నెంబర్‌కు కాల్ చేయాలని విజయ్ పేర్కొన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలలో ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ వ్యాదిపై అవగాహన కల్పించేందుకు సుమ మొదలగు సినీ తారలు తమ సోషల్ మీడియా ద్వారా తగు జాగ్రత్తలను వెల్లడించారు..

ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ప్రేక్షకులను నిరాశపరిచాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌తో కలిసి పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకి సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. 


Tags:    

Similar News