వెంకటేష్ తో క్రేజీ డైరెక్టర్?

Update: 2019-09-24 15:10 GMT

ఈ ఏడాది f2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన హీరో వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్య తో కలిసి " వెంకీమామ" అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ తో సినిమా చేయనున్నారని తెలుస్తుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే తరుణ్ భాస్కర్ చెప్పిన స్క్రిప్ట్ వెంకీకి బాగా నచ్చిందని తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Tags:    

Similar News