తమన్నా పెళ్లికి స్వయంవరం .. లిస్టులో ప్రభాస్

మిల్కీ బ్యూటిగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది హీరోయిన్ తమన్నా... ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది తమన్నా..

Update: 2020-03-10 10:46 GMT
tamanna bhatia, prabhas

మిల్కీ బ్యూటిగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది హీరోయిన్ తమన్నా... ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది తమన్నా.. ఓక హీరోయిన్ పదిహేనేళ్ళు సినీ ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామలు విషయం కాదు. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది తమన్నా.. ఆ తరవాత 100 % లవ్, రచ్చ, ఉసరవెల్లి మొదలగు చిత్రాలలో నటించి మంచి పేరును తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.

ఇక ఇది ఇలా ఉంటే తమన్నా పెళ్లిపైన ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వీటిపైన తమన్నా ఖండిస్తూ వచ్చింది. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా పెదవి విప్పింది.. " మీ పెళ్ళికి స్వయం వరం పెడితే, అందులోకి ఏ నటులు రావాలని కోరుకుంటారు" అని ప్రశ్నించగా, ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌ పేర్లను చెప్పుకొచ్చింది. మొత్తానికి తనకి కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయం పైన తమన్నాపక్కా క్లారిటీతోనే ఉందన్నమాట.. ఇక తన స్వయంవరానికి దక్షిణాది నుంచి హీరో ప్రభాస్ ఎంచుకోవడం విశేషం.. ప్రభాస్ , తమన్నా కలిసి 'రెబల్', 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాల్లో కలిసి నటించారు.

వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా ప్రస్తుతం మునపటి జోరును కనబరచలేకపోతుంది. గత ఏడాది 'ఎఫ్ 2', 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలలో నటించి మెప్పించింది. ఇక తాజాగా మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించి మెప్పించింది . ప్రస్తుతం గోపీచంద్ సరసన సిటీ మార్' మూవీలో నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత అయిన తమన్నా పెళ్లి పీటలు ఎక్కనుందా అన్నది చూడాలి మరి  

Tags:    

Similar News