మిథాలీ బయోపిక్‌లో తాప్సీ
మిథాలీ రాజ్ పుట్టిన రోజు కావడంతో హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ నాయకుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లని తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా లేడి సచిన్ గా పేరుగాంచిన భారత మహిళల జట్టు కెప్టెన్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పైన శభాష్ మిథు అనే పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. ఇందులో మిథాలి రాజ్ గా సినీ నటి తాప్సి కనిపించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా తాప్సీనే వెల్లడించారు.
ఈరోజు మిథాలీ రాజ్ పుట్టిన రోజు కావడంతో హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్ చేశారు. మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసే అవకాశం తాను రావడం గర్వకారణమని తాప్సీ అన్నారు. సినిమాలో అచ్చం మిథాలీలాగా కనిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సినిమాని హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో విడుదల చేయనున్నారు.
మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ..ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ముని-3 చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Happy Birthday Captain @M_Raj03 On this Birthday, I don't know what gift I can give you but this promise that I shall give it all I have to make sure you will be proud of what you see of yourself on screen with #ShabaashMithu
— taapsee pannu (@taapsee) December 3, 2019
P.S- I'm all prepared to learn THE 'cover drive' pic.twitter.com/a8Ha6BMoFs