మాట్నీ షో కంటే ముందే ఆన్‌లైన్‌లో సైరా ...

Update: 2019-10-02 14:48 GMT

సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద బాధ ఏదైనా ఉందా అంటే అది పైరసీ భూతం అనే చెప్పాలి. సినిమా పెద్దలు దీనిపైన చాలా చర్యలు తీసుకుంటున్నప్పటికి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టు లోకి సైరా సినిమా కూడా చేరిపోయింది. భారీ అంచనాలతో సైరా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎక్కడ చూసిన థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీనితో మెగా ఫాన్స్ పండగ ఓ వారం ముందే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సైరా సినిమా మాట్నీ షో కంటే ముందే తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్ లో ప్రత్యక్షం అయింది. విడుదలైన పైరసీ లింకులపై మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. పైరసీ లింకులు కనిపిస్తే syeraaantipiracy@gmail.comకి పంపించాలని చిత్ర యూనిట్ అభిమానులను కోరింది..  

Tags:    

Similar News