వెంకటేశ్వర స్వామి సాక్షిగా.. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు ఎవరూ బతికిలేరు : పృథ్వీ

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు పృథ్వీరాజ్ .. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న క్రమంలో

Update: 2020-03-07 16:05 GMT
comedian prudhvi Raj

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు పృథ్వీరాజ్ .. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చారు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరి చాలా ఆక్టివ్ గా ఉంటూ వచ్చారు. వైసీపీలో పృథ్వీ కష్టానికి తగ్గ గుర్తింపు కూడా దక్కింది. సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు..

మంచి పదవిలో కొనసాగుతున్న క్రమంలో అనుకోని సంఘటన పృథ్వీకి ఎదురైంది. ఎస్వీబీసీలోని ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయటకు రావడంతో పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో అయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఇదంతా కావాలనే జరిగిందా లేకా ఎవరైనా కావాలనే చేశారా అన్నది మాత్రం తెలియదు..

దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మరి తన గోడును వెళ్లబోసుకున్నారు పృథ్వీ... తాను మాత్రం ఏ తప్పు చేయలేదని, ఇదంతా కుట్రపూరితరంగా జరిగిందని,కావాలనే ఎవరో ఇదంతా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. ఒకవేళ ఇందులో తనది తప్పని తేలితే చెప్పుతో కొట్టిన పడతానంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు పృథ్వీ... ఇక ఇది జరిగిన కొన్ని రోజులకి చేతి కట్టు గాయంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి జరిగిన అన్యాయంపై మాట్లడుతూ బోరున ఏడ్చారు పృథ్వీ... నేను ఎప్పుడు ఏ టీవీ కార్యక్రమాల్లో కన్నీళ్లు పెట్టుకోలేదని అన్నారు.. నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు ఎవరూ బతికిలేరు.. వెంకటేశ్వర స్వామి సాక్షిగా.. కుటుంబ సభ్యుల సాక్షిగా ఒట్టేసి చెబుతున్నానని పృథ్వీ తన ఆవేదనని వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News