అల్లు అర్జున్ ని సుకుమార్ ఏ లోపంతో చూపించాబోతున్నాడు?

Update: 2019-11-03 09:15 GMT
allu arjun and sukumar

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ఆర్య,ఆర్య 2 సినిమాలు వచ్చాయి. హైట్రిక్ కొట్టేందుకు ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన ముహూర్తపు షాట్ కూడా అయిపొయింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లోపం ఉంటుందని తెలుస్తుంది.

బేసిక్ గానే సుకుమార్ సినిమాలు అంటే హీరోలకి ఎదో ఒక లోపం ఉంటుంది. అయితే అది మానసికంగా అయిన కావచ్చు లేదా శారీరకంగా అయిన కావచ్చు. ఇప్పటివరకు సుకుమార్ అన్ని సినిమాలు ఒక్కసారి చూసుకుంటే ఆర్య సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ హీరో పాత్రను డిజైన్ చేసిన సుక్కు ఆర్య2లో అల్లు అర్జున్ ను కొంచెం హైపర్ ఉన్న సైకో యువకుడిలా మార్చేశాడు. ఇక మహేష్ 1 నేనొక్కిడినే చిత్రంలో మానసిక సంఘర్షణతో భాదపడుతున్న హీరో పాత్రను డిజైన్ చేసాడు. ఇక మొన్న వచ్చిన 'రంగస్థలం'లో హీరో రాంచరణ్ ను చెవిటివాడిగా చూపించాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ కు సుకుమార్ ఎదో ఒక లోపం పెట్టాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

Tags:    

Similar News