Andrew Jack: కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి

Update: 2020-04-01 04:46 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. కరోనా వైరస్ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ 195 దేశాలకు పైగా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఐరోపా దేశాల్లో క్రమక్రమంగా ఈ వైరస్ పెరుగుతూ వస్తుంది. ఇక ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక ఇటలీలో అయితే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికి పది వేల మంది మరణించారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ నటుడు, స్టార్‌ వార్స్‌ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ ని కరోనా బలితీసుకుంది. 76 ఏళ్ల జాక్‌ స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో సర్రేలోని ఆసుపత్రిలో చేరిన ఆండ్రూ జాక్‌  చికిత్స పొందుతూ మంగళవారం మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. 




 





Tags:    

Similar News