మహాభారతం మొత్తం తీస్తా : రాజమౌళి

Update: 2019-12-29 14:36 GMT
Rajamouli

చేసిన 11 సినిమాల్లో ప్లాప్ అంటే ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి . ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి సరదాగా మత్తువదలరా టీం ( జై సింహ, అగస్త్య , సత్య) తో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా రాజమౌళి అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. అలాగే వారు అడిగిన ప్రశ్నలకి రాజమౌళి కూడా సమాధానం ఇచ్చారు.

అందులో భాగంగా కొత్తవాళ్లతో మీరు సినిమా చేస్తారా అని ప్రశ్నించగా కథ డిమాండ్ చేస్తే చేస్తానని, అందులో ఎలాంటి డౌట్ అక్కరలేదని చెప్పుకొచ్చాడు. ఇక మహాభారతంలోని ఒక్క ఎపిసోడ్ ని అయిన మీరు తీస్తారా అని అడగగా, దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ మహాభారతం ఒక్క ఎపిసోడ్ కాదు మొత్తం మహాభారతాన్ని తీస్తానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. కథ రాసుకునేటప్పుడే తాను కథానాయకుడిని ఎంపిక చేసుకుంటానని, సినిమా సినిమాకి ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని నేను పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ ) అనే సినిమాని చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30 న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గాకనిపిస్తున్నాడు. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్టు తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News