కరెంట్ బిల్లులు కట్టలేని స్థితిలో సినిమా ధియేటర్లు ఉన్నాయి: సురేష్ బాబు

ప్పుడు ధియేటర్లులలో పనిచేసేవారికి జీతాలు ఇవ్వడం కాదు కదా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ధియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని అన్నారు.

Update: 2019-11-18 16:57 GMT
suresh babu

కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితిలో సినిమా ధియేటర్లు ఉన్నాయని అన్నారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు.. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. డిజిటల్ ప్లాట్ ఫాంలు బాగా పాపులర్ అయ్యాక ధియేటర్ కి వచ్చి సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదని, సాహో, సైరా లాంటి పెద్ద సినిమాలను మాత్రమే ధియేటర్లుకి వచ్చి చూస్తున్నారని అన్నారు.సింగిల్ స్క్రీన్ యజమానులకు అనేక సమస్యలు ఉన్నాయని అయన తెలిపారు. మల్టీ ప్లెక్సులు వచ్చాక సింగిల్ స్క్రీన్ లకి డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పుడు ధియేటర్లులలో పనిచేసేవారికి జీతాలు ఇవ్వడం కాదు కదా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ధియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని అన్నారు. 

Tags:    

Similar News