చిరు అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే ..

Update: 2019-07-03 16:21 GMT

మెగాస్టార్ చిరంజీవి అంటే మనకు అయన నటన తర్వాత  తొందరగా గుర్తుంచేది డాన్స్ మాత్రమే.. అయన సినిమాల్లో డాన్స్ లేదు అంటే ఎలా ఉంటుంది? సినిమాల్లో డాన్స్ ని తీసేయండి అని స్వయంగా చిరునే చెబితే ఇంకెలా ఉంటుంది చెప్పండి..చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహ రెడ్డి .. అయితే ఈ సినిమా రషెస్ చూసారట చిరు .. అందులోని ఓ స్పెషల్ సాంగ్ లో చిరు చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి . దీనితో చిరు అ స్టెప్స్ కూడా తీసేయండని చెప్పారట ..! అంతే కాకుండా సినిమాలోని కొన్ని మిస్టేక్స్ కూడా సూచించారట.. ! ప్రస్తుతం చిరు చేస్తుంది ఓ స్వాతంత్య్ర సమరయోదిడి కథ కాబట్టి చిరు టీం కి ఈ సూచనలు చేసారట ..! ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ టీం కూడా ఇదే పనిలో ఉన్నారట... చిరు డాన్సులు లేకుండా సినిమాను ఉహించుకోవడం అభిమానులకు కొంచం కష్టమే అని చెప్పుకోవాలి ..  

Similar News