సాహో చిత్రానికి కాపీ సెగ ...
సినిమాలో వచ్చే ఓ పాట తన పేయింటింగ్ ని పోలి ఉందని తన అనుమతి లేకుండా అ పేయింటింగ్ ని ఎలా వాడుతారని షిలో శివ్ సులెమాన్ అనే మహిళ ఆర్టిస్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది .
ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూసిన సాహో సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొత్తం నాలుగు బాషల్లో విడుదలైన ఈ సినిమాకి ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తుంది . అయితే ఇప్పుడు ఈ సినిమాని ఓ వివాదం వెంటాడుతుంది . సినిమాలో వచ్చే ఓ పాట తన పేయింటింగ్ ని పోలి ఉందని తన అనుమతి లేకుండా అ పేయింటింగ్ ని ఎలా వాడుతారని షిలో శివ్ సులెమాన్ అనే మహిళ ఆర్టిస్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది . " సాహో సినిమాకి గాను అ పేయింటింగ్ వాడుకోవడానికి మీకు స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది . అ పేయింటింగ్ నా హృదయ స్పందనకి రూపం , ఎంత తపిస్తే అ పేయింటింగ్ వచ్చిందో మీకు తెలుసా ? ఇలాగే మీ సినిమాలోని కథని మీకు చెప్పకుండా వాడుకుంటే మీరు ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నిస్తుంది .
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండిన Shilo Shiv Suleman (@shiloshivsuleman) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది