శేఖర్ కమ్ముల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్...?

Update: 2019-11-02 12:36 GMT
shekhar kammula

శేఖర్ కమ్ముల అచ్చు తెలుగు సినిమాలు చేసినప్పటికి ఆయన సినిమా టైటిల్ మాత్రం ఇంగ్లిష్ లోనే ఉంటాయి.. హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా,లీడర్ ఇలా ఉంటాయి.. ఇప్పుడు అయన చేయబోయే సినిమాకి కూడా ఇలాంటి టైటిల్ నే పెట్టినట్టు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ఫిదా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

పూర్తిస్థాయి ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాకి గాను లవ్ స్టొరీ అనే టైటిల్ పెట్టినట్టు టాక్ నడుస్తుంది. వినడానికి మామలుగానే ఉన్నా సినిమా మొత్తం లవ్ స్టొరీని బేస్ చేసుకొని నడుస్తుంది కాబట్టి ఈ టైటిల్ ని పెట్టాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో నాగ చైతన్య తెలంగాణా కుర్రాడుగా కనిపించనున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Tags:    

Similar News