శ్రీదేవి మరణం వెనుక కారణం ఇదే అంటున్న ర‌చయిత‌

అతిలోక సుందరి శ్రీదేవి మరణం ప్రతి ఒక్క అభిమానిని షాక్ కి గురిచేసింది. ఆమె ఇక లేదు అన్న వార్తను సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయారు.

Update: 2020-01-05 10:34 GMT

అతిలోక సుందరి శ్రీదేవి మరణం ప్రతి ఒక్క అభిమానిని షాక్ కి గురిచేసింది. ఆమె ఇక లేదు అన్న వార్తను సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయారు. 2018 ఫిబ్రవరి 24న బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన ఆమె ఒక హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూశారు. అయితే ఆమె మరణం వెనుక రకరకాల వార్తలు వచ్చాయి. ఆమె మ‌ద్యం మ‌త్తులో బాత్ ట‌బ్‌లో ప‌డి మునిగి చ‌నిపోయింద‌ని డాక్ట‌ర్లు తేల్చడం, దుబాయ్ పోలీసులు కూడా అదే వివ‌రాల‌ను న‌మోదు చేసుకుని కేసు క్లోజ్ చేయ‌డంతో ఆమె మరణం అభిమానులకి ఓ ప్రశ్నగానే మిగిలిపోయిది.

ఇక ఇది ఇలా ఉంటే శ్రీదేవి మరణానికి సంబంధించిన అసలు కారణాలను ప్రముఖ రచయత సత్యర్ధి నాయక్ వెల్లడించారు. శ్రీదేవి జీవితంపై అయన బయోగ్రఫీ పుస్తకం రాసాడు. ఇందులో ఆమె మరణానికి గల కారణాలు ఏంటో వెల్లడించాడు.

శ్రీదేవి కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మరియు సినీ పరిశ్రమకి సంబంధించిన పలువురి దగ్గర స‌మాచారం సేక‌రించి బ‌యోగ్ర‌ఫీని రూపొందించారు. తాజాగా ఈ విషయాన్ని ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే శ్రీదేవితో 'చాల్‌‌బాజ్' చిత్రాన్ని తెరకెక్కించిన పంకజ్ పరాషర్ తనతో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు సత్యార్ధి నాయక్. అంతేకాకుండా హీరో నాగర్జునతో శ్రీదేవి సారి షూటింగ్‌లో జరిగేటపుడు ఓసారి బాత్రూమ్‌లో పడిపోయిన సందర్భాన్ని తనతో ప్రస్తావించినట్టు సత్యర్ధి నాయక్ వెల్లడించాడు.

ఇక తన భర్త బోనీ కపూర్‌ తో శ్రీదేవి ఒక్కోసారి వాకింగ్ చేసేటపుడు కుప్పకూలిన సందర్భాలున్నాయన్నాయని వెల్లడించారు. తక్కువ రక్తపోటు అదే లో బీపీ కారణమనే విషయం ఈ సంఘటనలతో స్పష్టమైందని అయన అందులో పేర్కొన్నారు.  

Tags:    

Similar News