నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత వరస విజయాలతో దూసుకుపోతోంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే ఈ తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన 'మజిలీ' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా 'ఓ బేబీ'తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. కొరియన్ సినిమా మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వసూళ్లలో దుసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సమంత వైట్‌డ్రెస్‌లో తళుక్కుమన్నారు. ఈ క్రమంలో ఫొటోషూట్‌లో పాల్గొన్న సమంత సోషల్‌మీడియా వేదికగా తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. ' కెరీర్లో బెస్ట్ ఫేజ్‌ను గడుపుతున్నాను… ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చైయ్ నా ప్రపంచం' అంటూ తన భర్త పేరుతో ఉన్న సీక్రెట్ టాటూను రివీల్ చేసింది. సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.