వైజాగ్‌లో 'రూలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈనెల 14
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రూలర్'.. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య్రకమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
అయితే విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈనెల 14న వైజాగ్ లోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకి చిత్ర యూనిట్ తో పాటు పలువురు అతిధులు పాల్గొననున్నారు..
జై సింహ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కలిసి సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు. బాలయ్య సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందించారు.