బాహుబలి లాంటి భారీ హిట్టు తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా RRR ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ) ... ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తూ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
షూటింగ్ లో ఇద్దరికీ గాయాలు
అయితే తాజా సమాచారం ప్రకారం అనుకున్న టైంకి RRR విడుదలవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలకి ఒకసారి గాయాలు అయ్యాయి. దీనితో షూటింగ్ వాయుదా పడుకుంటూ వచ్చింది. ఇక గాయాలు నుండి కోలుకున్నాక చిత్రం మళ్ళీ షూటింగ్ జరుపుకుంది. ఈ నేపధ్యంలో సైరా సినిమా రావడంతో ప్రమోషన్ కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు చరణ్.. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్తో బల్గేరియా షెడ్యూల్ను పూర్తి చేశాడు రాజమౌళి దీనితో జక్కన్న అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేస్తాడా అన్న అనుమానం కలుగుతుంది.
ఎన్టీఆర్ కి జోడిగా ఎవరు ?
ఇక వీటికి తోడు సినిమా రామ్ చరణ్ పక్కన అలియా భట్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది కానీ ఎన్టీఆర్కు పక్కన హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం ఫైనల్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయటం అనుమానంగాను ఉంది. ఇది పిరియాడిక్ సినిమా కావడంతో టెక్నికల్ గా కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఇన్ని సమీకరణలు చూస్తుంటే సినిమాఅనుకున్న సమయానికి విడుదల అవ్వడం అన్నది కొంచం డౌట్ గానే అనిపిస్తుంది. సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకుంటే 2021 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది చూడాలి మరి..