పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి బద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

Update: 2020-04-20 09:36 GMT
Pawan Kalyan, Renu desai (Badri- File Photo)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి బద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.. వీరికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్నారు.. కొన్నిరోజుల తర్వాత వ్యక్తిగత కారణాలతో పవన్ కళ్యాణ్ , దేశాయ్ విడాకులు తీసుకున్నారు..ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లెజ్‌నేవాను మూడో వివాహం చేసుకున్నారు..

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ కలిసి నటించిన బద్రి సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.. అందులో భాగంగా మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాలోని బంగాళాఖాతంలో .. అంటూ సాగే ఒక పాట షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకున్నారు.

విదేశాల్లో సిటీకి దూరంగా వుండే ఒక రిమోట్ ఏరియాలో షూటింగు జరిగింది. షాట్ గ్యాప్ లో అక్కడ కూర్చోవడానికి కూడా ఏమీ ఉండేవి కాదు. అక్కడ ఒక బండ వుంటే పవన్ దానిపై కూర్చున్నారు. నేను షార్ట్ స్కర్ట్ వేసుకున్న కారణంగా ఆ బండపై కూర్చోలేకపోయాను. 'ఒక అమ్మాయి మీ పక్కన నిలబడి ఉండగా కూర్చోవడం బ్యాడ్ మేనర్స్' అంటూ కల్యాణ్ గారితో సరదాగా జోక్ చేశాను కూడా. అది గాలి బాగా వీచే ప్రదేశం కావడంతో నిలబడటం, డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా వుండేది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఇక పవన్ తో చేసిన చికితా పాటకు సంబంధించిన ఫోటోను కూడా రేణుదేశాయ్ పోస్ట్ చేశారు.. ఈ సినిమా తర్వాత వీరిద్దరు జానీ సినిమా కోసం కలిసి పనిచేశారు..


Tags:    

Similar News