ఘనంగా కృష్ణంరాజు 80 వ పుట్టినరోజు వేడుకలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు 80 వ పుట్టినరోజు వేడుకలు అయన కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి.

Update: 2020-01-20 12:53 GMT

రెబల్ స్టార్ కృష్ణంరాజు 80 వ పుట్టినరోజు వేడుకలు అయన కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. అయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి ప్రత్యేకమైన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు. ఈ పార్టీలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చిత్ర పరిశ్రమలోని చిరంజీవి, మంచు మోహన్ బాబు , లక్ష్మి, విష్ణు తదితరులు హాజరయ్యారు. 180కి పైగా తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను వేశారు. ప్రస్తుతం అయన నట వారసుడిగా ప్రభాస్ సినిమా పారిశ్రమలో కొనసాగుతున్నాడు.  

Delete Edit

 

Tags:    

Similar News