డిస్కో రాజా వచ్చేది అప్పుడే ....

Update: 2019-08-30 12:06 GMT

రవితేజ సినిమాని దియేటర్లో చూసి చాలా కాలమే అయ్యింది . ప్రస్తుతం రవితేజ వీఐ ఆనంద్‌ డైరెక్షన్ లో డిస్కో రాజా అనే సినిమాని చేస్తున్నాడు . ఇందులో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు .ఇందులో రవితేజ తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను వినాయకచవితి సందర్భంగా విడుదల చేయనున్నారు . ఇక సినిమాని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమాని అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది . 

Tags:    

Similar News