Raviteja Birthday Gift : ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నేడు (జనవరి26) 53 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు

Update: 2020-01-26 04:33 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నేడు (జనవరి26) 53 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా రవితేజ 'డిస్కోరాజా' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్న చిత్రాల దర్శకుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. ఇక మొదటిరోజే రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అందుకున్న చిత్రంగా నిలబడింది. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు.

ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే రవితేజ తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ రోజు రవితేజ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మే 8 న సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇదే సినిమాతో పాటు రవితేజ మరో సినిమాని మొదలుపెట్టాడు. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. తాజాగా రమేష్ వర్మ రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక గతంలో కూడా రవితేజతో వీర అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ సినిమాని యంగ్ హీరో హవీష్‌ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు మాస్‌ మహరాజ్‌.

రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్ ఇచ్చాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.  


Delete Edit


Tags:    

Similar News