ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తేలిపోయింది?

Update: 2019-09-28 12:10 GMT

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 3 దూసుకుపోతుంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఇక పదో వారం ఎలిమినేషన్ కి గాను రంగం సిద్దం అయింది. పదో వారానికి గాను వ‌రుణ్ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, ర‌వి ఈ వారం ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు. ఇందులో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అన్న దానిపై ఉత్కంట నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం రవి ఎలిమినేట్ అవుతునట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఓటింగ్‌లో ర‌వికే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది. అందుకే ఈవారం అతనే ఎలిమినేష్ అని తెలుస్తుంది. అయితే దీనిపైన క్లారిటీ రావాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే..  

Tags:    

Similar News