అసురన్ రీమేక్ లో మరో హీరో?

ఈ సినిమాకి ముందునుండి చాలా మంది దర్శకులను అనుకున్నారు. అందులో ప్రముఖంగా హను రాఘవపూడి

Update: 2019-12-03 11:23 GMT
Asuran Telugu Movie remake

తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు...ఈ సినిమాలో ధనుష్ కుర్రవాడిగా, మధ్య వయస్కుడి పాత్రలో కనిపించి మెప్పించ్చాడు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. వెంకటెష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. వెంకటేష్ తో పాటు ఈ సినిమాలో రానా కూడా కనిపించనున్నాడని టాక్.. ఇందులో రానా కుర్రవాడిగా కనిపిస్తే, మధ్య వయస్కుడి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..

ఇక ఈ సినిమాకి ముందునుండి చాలా మంది దర్శకులను అనుకున్నారు. అందులో ప్రముఖంగా హను రాఘవపూడి, రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ పేర్లు వినిపించాయి. కానీ ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల పేరుని పరిశీలించారు. గతంలో శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా వచ్చింది. 

Tags:    

Similar News