Disha: చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకేక్కిస్తుంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకేక్కిస్తుంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత ఏడాది హైదరాబాద్ శివారులో యువ వైద్యురాలుపై సాముహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే.. ఇందులోని ప్రధాన నిందితులు అయిన నలుగురిని పోలీసులు రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వారిని ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు దీనినే వర్మ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
అందులో భాగంగా దిశ కేసులో నిందితుడు అయిన చెన్నకేశవులు భార్య రేణుకను వర్మ ఈ రోజు కలిశారు. ఆమె బ్రతుకుదెరువు కోసం బ్లాంక్ చెక్కు ఇచ్చినట్టు తెలుస్తోంది. " 16 ఏళ్లకే రేణుకకి పెళ్లి అయింది. 17 ఏళ్ళకి ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.. చెన్నకేశవులు దిశనే కాదు. రేణుకను కూడా మోసం చేశాడు. రేణుక ఇంకా చిన్న పిల్ల. అలాంటిది ఆమె త్వరలో ఓ పిల్లకు జన్మనివ్వబోతోంది. . ఇప్పుడు ఆమెకి, తన బిడ్డకి భవిష్యత్తు లేకుండా పోయింది" అంటూ ట్వీట్ చేశాడు.
Just met Renuka , Rapist Chenna keshavlu's wife ..She married him at 16 and she's about to deliver his baby at 17 ..Not only Disha, the bastard made his own wife a victim too ..she is a child giving birth to a child and both have no future pic.twitter.com/zcVwL1p1Bu
— Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2020
వర్మ తెరకేక్కించే ఈ సినిమాలో రేప్ చేయాలనుకునే వాళ్లు భయంతో వణికిపోయేలా సన్నివేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకప్పటి రేపిస్ట్ల నుంచి కొత్తగా వస్తున్న రేపిస్ట్లు ఏం నేర్చుకుంటున్నారో 'దిశ' సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నానని వెల్లడించారు. ఆలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో ఈ సినిమాలో చూపిస్తానని, సినిమాలో ప్రతీ విషయం క్షుణ్ణంగా చెబుతానని" వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
My next film is titled "DISHA" which is going to be about the DISHA rape ..After the brutal rape and horrific murder of NIRBHAYA, the DISHA rapists went further in their ghastliness in actually burning the poor girl with petrol #DishaNirbhayaTruth pic.twitter.com/3SiiesIgR8
— Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020