'బాబో'య్ రామూ.. బాబుని దించేసాడుగా!

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలుగు చిత్ర సీమలో వివాదాలకు కేంద్రం. ఆయన నుంచి సినిమా వస్తోందంటేనే ప్రేక్షకులలో ఉత్సుకత ఏర్పడిపోతుంది. ఇక అర్జీవీ చేసే పబ్లిసిటీ గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అయన తన సినిమాలను తానే ప్రమోట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు అయన తన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి అదే పంథాలో ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సినిమాలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందో ఓ ఫోటో విడుదల చేసి సంచలనం సృష్టించారు.

Update: 2019-09-06 11:01 GMT

రామ్ గోపాల్ వర్మ ఎం చేసినా ఓ సెన్సేషనే .. అదో ఓ ట్వీట్ కావచ్చు . ఓ సినిమా కావచ్చు ... ఈ మధ్య అయన సినిమాల పై కన్నా రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తుంది .అందులో భాగంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ముందు నుండి వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడంతో తన ట్వీట్ లకి మరింత డోస్ పెంచాడు వర్మ ... వరుసగా ఎదో ఒక ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు .

వర్మ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు .. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని వర్మ ఇప్పటికే రిలీజ్ చేసాడు. కులాలను ప్రస్తావిస్తూ చేసిన ఈ పాట సంచలనం సృష్టించింది.  ఇప్పుడు  తాజాగా  సినిమాలోని పాత్రల కోసం వేట మొదలు పెట్టాడు . అందులో భాగంగానే సినిమాలోని చంద్రబాబు పాత్రను తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసాడు. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లోగో రేపు (శనివారం) ఉదయం 9.27 గంటలకు విడుదల చేయనున్నట్టు తన ట్వీట్ లో ప్రకటించారు.ఇక సినిమా ఫుల్ స్పీడ్ లో ఉంటుందని వర్మ పేర్కొన్నాడు 


Tags:    

Similar News