మాస్ గెటప్ తో ముసాపేట ధియేటర్ కి రామ్ గోపాల్ వర్మ ..

Update: 2019-07-20 09:35 GMT

యంగ్ హీరో రామ్ , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ .. తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది . అయితే ఈ సినిమాని పైన పూరి గురువు అయిన రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ చేస్తూ సినిమాకి పెద్ద ప్రమోషన్ ని తెచ్చిపెడుతున్నారు . పూరి నెంబర్ వన్ దర్శకుడని మరో సారి ఋజువు అయ్యిందని చెప్పుకొచ్చారు .. అంతే కాకుండా మరో ట్వీట్ చేస్తూ.. ఈ సినిమాని చూసేందుకు శనివారం రోజున తనతో పాటు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మరియు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సహాయ దర్శకుడు అయిన అగస్త్య కలిసి బైక్ పైన వచ్చి ముసాపేటలో ఉన్న శ్రీరాములు ధియేటర్ లో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే షో చూస్తూ సందడి చేయనున్నామని అయన ట్వీట్ చేసారు . 



Tags:    

Similar News