మరోసారి ఇస్మార్ట్ శంకర్ గానే ?

ఈ సినిమాలో యంగ్ హీరో రామ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇటివలే రొమాంటిక్ చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకుంది.

Update: 2019-12-05 02:34 GMT
Ram,Akash Puri

ఆకాష్ పూరి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం " రొమాంటిక్ " .. కేతికా శర్మ కథానాయకగా నటిస్తుంది. పూరి జగన్నాధ్ అందించిన కథ, కథనాలతో అనిల్ పొందూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని కథ, కథనాలతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు పూరి జగన్నాధ్..

అయితే ఈ సినిమాలో యంగ్ హీరో రామ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇటివలే రొమాంటిక్ చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకుంది. అందులో భాగంగా హీరో రామ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో కూడా రామ్ ఇస్మార్ట్ శంకర్ గానే కనిపిస్తారని సమాచారం.. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఇదే సినిమాలో రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే గతంలో రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో డబల్ ఇస్మార్ట్ సినిమాని తెరకేక్కిస్తానని పూరి ఇప్పటికే ప్రకటించాడు కూడా..

ఇక హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. వేసవిలో సినిమాని విడుదల చేయనున్నారు. 

Tags:    

Similar News