బక్క చిక్కిన రకుల్... ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..

Update: 2019-11-05 04:05 GMT
rakul preet singh

రకుల్ ప్రీత్ సింగ్ .. తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒకరు..సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు, రారండోయ్ వేడుకచూద్దాం లాంటి సినిమాలను చేసి హిట్టు కొట్టింది. దీనితో స్టార్ హీరోయిన్ లిస్టు లోకి చేరింది.

తాజాగా ఆ భామ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. నాగార్జునతో చేసిన మన్మధుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీనితో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. సినిమా హిట్టు అయినప్పటికే రకుల్ కి పెద్ద పేరు రాలేదు. ఈ సినిమా కోసం బాగా బక్క చిక్కింది రకుల్... తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలని చూసి ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. 



Tags:    

Similar News