మంత్రి తలసానితో రాహుల్...

Update: 2019-11-09 13:38 GMT
talasani srinivas yadav ,rahul

బిగ్ బాస్ 3 తెలుగు విన్నర్ రాహుల్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. విజేత కావడంతో ఇప్పుడు పలు టీవీ షోలోకి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు రాహుల్.. తాజాగా రాహుల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. దీనికి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు రాహుల్.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ వైరల్ గా మారింది.

మంత్రి తలసాని యాదవ్‌ను కలిసిన పిక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాహుల్ .. తలసానిని ఉద్దేశిస్తూ " డైనమిక్ లీడర్ ,డౌన్ టు ఎర్త్ అంటూ పొగిడేశాడు. ఆయనని కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రాహుల్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నాడా ? అని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఇంకొందరు బిగ్ బాస్ 3 కి విజేతగా గెలిచినందుకు సంతోషంలో మంత్రిని కలిశాడని కామెంట్ పెడుతున్నారు.

బిగ్ బాస్ 3 లోకి ఓ సింగర్ గా అడుగుపెట్టిన రాహుల్ ప్రేక్షకుల ఆదరణను పొంది టాప్ 5 కి చేరుకున్నాడు. అక్కడినుండి విజేతగా నిలిచి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ట్రోఫీని అందుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ ప్రైజ్ మనీ యాబై లక్షలను అందుకున్నాడు.  




Tags:    

Similar News