ఏ మాటకి ఆ మాటే..లక్కంటే రాశీఖన్నాదే

ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, జై లవకుశ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచారు హీరోయిన్ రాశీఖన్నా..

Update: 2019-12-28 11:53 GMT
రాశీఖన్నా

ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, జై లవకుశ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచారు హీరోయిన్ రాశీఖన్నా.. కానీ ఇప్పుడు ఈ అమ్ముడుకి ఓ భారీ హిట్టు అవసరం అనుకున్న క్రమంలో ఒక్క నెలలోనే రెండు భారీ హిట్లు వచ్చాయి. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా తర్వాత సరైనా హిట్టు లేకా అవకాశాలు లేకా హిట్ తప్పనిసరి అన్న క్లిష్టమైన సమయంలోనే ఆమెకు రెండు హిట్లు దక్కడం విశేషం.

వెంకీమామ, ప్రతిరోజూ పండగే చిత్రాలు మంచి హిట్టును అందుకొని కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు సినిమాలలో ముఖ్యంగా `ప్రతిరోజూ పండగే` సినిమా రాశీఖన్నాకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. రాశీఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతుంది.

ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు హిట్టు అయిన రెండు విజయాలతో ఈ సంవత్సరం ని చాలా గ్రాండ్ గా ముగించింది రాశీఖన్నా..ఇక ఈ సక్సెస్ తో తనకు టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తాయని రాశీ భావిస్తోంది. 

Tags:    

Similar News