పూరి 'జనగణమణ' కి ఈ సారి హీరో ఎవరంటే ?

Update: 2019-07-23 09:11 GMT

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు . ఇప్పుడు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పూరి తన తర్వాత సినిమా ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది . సినిమా సినిమాకి పెద్దగా టైం తీసుకోడు . హిట్టు , ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమా పట్టాలెక్కించడమే పూరి స్టైల్ కూడా ..

అయితే పూరి తర్వాత సినిమాని అప్పుడెప్పుడో పోకిరి, బిజినెస్ మన్ సినిమా తర్వాత మహేష్ బాబుతో అనౌన్సు చేసిన 'జనగణమణ' స్క్రిప్ట్ ని బయటకు తీయనున్నాడట పూరి . అయితే ఈ సారి మహేష్ తో మాత్రం కాదట ..

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో మంచి స్టార్డం సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు పూరి ప్లాన్ లో ఉన్నాడట .. ! అయితే మహేష్ వద్దన్నా కథని విజయ్ ఒకే చెప్తాడా లేదా అన్నది మాత్రమే డౌట్ .. మంచి మాస్ హీరోగా పేరున్న విజయ్ కి పూరి లాంటి డైరెక్టర్ దొరకితే 'జనగణమణ' బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయం ..  

Tags:    

Similar News