మంచు వారి ఇంట్లో యంగ్ రెబల్ స్టార్...

Update: 2019-10-27 15:41 GMT

సాధారణంగా సినిమా హీరోలు ఒకరిని ఒకరు సినిమా షూటింగ్ సమయంలో లేదా ఆడియో ఫంక్షన్స్ లో కలవడం జరుగుతుంది. కానీ ఒకరి ఇంట్లో మరొకరిని కలవడం అనేది చాలా రేర్ అని చెప్పాలి. అందులో భాగంగానే హీరో మంచు విష్ణు ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయ్యాడు హీరో ప్రభాస్.. అక్కడికి వెళ్లి ప్రభాస్ వారితో సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. మంచు ఫ్యామిలీతో ప్రభాస్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో విష్ణు సినిమా అయిన దేనికైనా రెడీ సినిమాకి గాను తన వాయిస్ ని అందించాడు ప్రభాస్, ఇక ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ఓ ముఖ్యపాత్రలో నటించారు.  



Tags:    

Similar News