Payal Rajput: ఆ పాత్రకి విజయశాంతినే నాకు స్ఫూర్తి : పాయల్‌

పాయల్‌ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న తాజా చిత్రం '5Ws'... ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కైవల్య క్రియేషన్స్ పతాకంపై

Update: 2020-03-06 03:08 GMT
payal rajput, vijayashanthi

పాయల్‌ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న తాజా చిత్రం '5Ws'... ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా నటి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ .. ప్రతి నటికి పోలీస్‌ అధికారిగా నటించాలన్న కోరిక ఉంటుందని, తానూ ఈ పాత్రని చేయడానికి నటి విజయశాంతినే నాకు స్ఫూర్తి అని ఆమె పేర్కొంది.

పోలీస్‌ అధికారిగా నటించే ఛాన్స్‌ రావడం నాకు ఎంతో అదృష్టమని భావిస్తున్నానని, నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రణదీప్‌కు ధన్యవాదాలు. ఆయన కథ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నానని పాయల్‌ వెల్లడించింది. దర్శకుడు ప్రణదీప్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా అని, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

RX 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన పాయల్‌ రాజ్‌పుత్ ఆ తర్వాత ఎక్కువగా బోల్డ్ సినిమాలో నటించింది. కానీ గత ఏడాది సీనియర్ హీరో వెంకటేష్ తో వెంకీమామలో నటించి మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో ముగఅమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ..  



 


Tags:    

Similar News