మే 23న ధియేటర్ లోకి పవన్ సినిమా?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆ ఎన్నికల్లో

Update: 2020-01-17 10:30 GMT

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయినప్పటికి ప్రజల తరుపున ప్రభుత్వం పై పోరాడుతూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే అయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన పింక్ సినిమాని పవన్ తెలుగు రీమెక్ చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమాపైన ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించింది లేదు.

అయితే తాజగా ఈ సినిమాపైన సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి గాను తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని ఒక్కోపాట సూప‌ర్ హిట్ అయిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్రత్యేక ఫ్లవ‌ర్ బొకేను పంపారు. ఈ సందర్భంగా పవన్ తమన్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదే విషయాన్నీ తమన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. పవన్ కీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం ప‌వన్ సినిమాల‌కి పాట‌లు కంపోజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అని పేర్కొన్నాడు థ‌మ‌న్.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 23న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 20నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, భారీ పారితోషకం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Tags:    

Similar News