'సైరా నరసింహారెడ్డి' ... పవన్ గంభీరమైన స్వరం. వీడియో చూడండి.. !

Update: 2019-08-19 10:03 GMT

ఖైది నెంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ... స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది . ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది . అయితే ఈ సినిమాకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వరం అందిస్తున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలను సామజీక మాధ్యమాలలో విడుదల చేసారు . తాజాగా పవన్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియోను చిత్రబృందం విడుదల చేసింది..

పవన్ వాయిస్ ఇస్తుంటే చిత్రబృందం ఆయనని అభినందిస్తూ ఉన్నారు . ఇక వీడియో చివరలో పవన్ తన గంభీరమైన స్వరంతో 'సైరా నరసింహారెడ్డి' అని అన్నారు . అ తర్వాత చిరు పవన్ కి గట్టిగా హత్తుకున్నారు . పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు గాను చిత్ర యూనిట్ ఆయనకి అభినందనలు తెలిపింది . గాంధీ జయంతి సందర్భంగా సినిమాని అక్టోబర్ రెండవ తేదిన విడుదల చేస్తున్నారు . ఇక చిరంజీవి పుట్టినరోజు( ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయనున్నారు .. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ..

Full View 

Tags:    

Similar News