Pawan Kalyan: కరోనా కట్టడికి పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయల విరాళం

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు.

Update: 2020-03-26 05:09 GMT
Pawan Kalyan

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు.ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద మనసును చాటుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో  ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో దేశానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.



పవన్ చేసిన ఈ సహాయానికి ఆయన అభిమానులు మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.."ఇంకా సినిమాలు ఎందుకు అని అనకండి... కొంతమందికి  సినిమా అవసరం.. కొంతమంది సినిమాకి అవసరం" అంటూ ట్వీట్ చేశారు..

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News