దిశా కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్, రామ్ లక్ష్మణ్

హైదరాబాద్ శివారులో సంచనలనం సృష్టించిన దిషా హత్య కేసుపై ప్రతి ఒక్కరు తమ స్పందనని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా

Update: 2019-12-03 13:04 GMT
manchu manoj

హైదరాబాద్ శివారులో సంచనలనం సృష్టించిన దిషా హత్య కేసుపై ప్రతి ఒక్కరు తమ స్పందనని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. భాదితురాలు కుటుంబానికి దేవుడు దైర్యాన్నిఇవ్వాలని ఆశిస్తున్నారు. ఈ నేపద్యంలో హీరో మంచు మనోజ్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ భాదిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇక ఇదే ఘటనపై ప్రముఖ రచయిత గోపాలకృష్ణ పరుచూరి స్పందించారు. జరిగిన ఘటన గుర్తొస్తే కన్నీళ్లు రాకపోతే మనుషులం కాదని కాదనీ అభిప్రాయపడ్డారు గోపాలకృష్ణ .. దిశా ఘటనపై యావత్ భారతదేశం ఇప్పుడు కన్నీళ్ళు పెడుతుందని అన్నారు. ఇంత వయసు వచ్చి న, ఇంత చదువుకున్నా నాకు జీరో ఎఫ్ఐఆర్ ఉంటుందని తెలియదని అన్నారు. టీవీ ఛానళ్ళు 100, జీరో ఎఫ్ఐఆర్ లాంటి వాటి గురించి ఆవాహన కలిపించేలా వారానికి ఒకసారి అయిన కార్యక్రమాలని చేయాలని కోరారు. 

Full View

Tags:    

Similar News