ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం: చిరంజీవి

Update: 2020-05-28 06:20 GMT

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక ఎన్టీఆర్‌ జయంతి పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. మెగాస్టార్‌ చిరంజీవి స్వర్గీయ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌తోను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. 'తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...' అంటూ చిరు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు.  


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 


Tags:    

Similar News