జనవరి 31 న 'నిశ్శబ్ధం' గా అనుష్క

దాదాపుగా షూటింగ్ మొత్తం ఫారిన్ లోనే షూటింగ్ జరుపుకుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు

Update: 2019-12-02 14:18 GMT
nishabdham

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'నిశ్శబ్ధం'...హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుష్క ఓ మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. శాలిని పాండే, అంజలి, మాధవన్, అవ‌స‌రాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని జనవరి 31, 2020 విడుదల చేయనున్నారు.

దాదాపుగా షూటింగ్ మొత్తం ఫారిన్ లోనే షూటింగ్ జరుపుకుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర టిజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. 

Full View 

Tags:    

Similar News