అర్జున్ సురవరం లేటెస్ట్ కలెక్షన్స్

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా 1.15 కోట్లను సాధించింది.

Update: 2019-12-03 16:45 GMT
arjun suravaram

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. నవంబర్ 29 న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా సినిమా కలెక్షన్ల గురించి హీరో నిఖిల్ వెల్లడించాడు. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా పంచవ్యాప్తంగా 12.3 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలిపాడు నిఖిల్ ..ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు నిఖిల్.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ రకరకాల కారణాల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. లేట్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా 1.15 కోట్లను సాధించింది.

తమిళ్ లో కనితన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు నేటివిటిగా తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించారు. పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  



Tags:    

Similar News