కార్తికేయ 2 వచ్చేస్తుంది!
యంగ్ హీరో నిఖిల్ కెరీయర్ ని మలుపు తిప్పిన సినిమా కార్తికేయ.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.
యంగ్ హీరో నిఖిల్ కెరీయర్ ని మలుపు తిప్పిన సినిమా కార్తికేయ.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. యానిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు మంచి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడా అని తెలుగు ప్రేక్షకులు అడుగుతూ వస్తున్నారు. ఈ ప్రశ్నలకి తెరదించుతూ కార్తికేయ 2 పైన క్లారీటీ ఇచ్చింది చిత్ర బృందం..
అయితే ఈ చిత్రాన్ని సీక్వెల్ ని మార్చి 2న తిరుమల తిరుపతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీవేంకటేశ్వరుని సన్నిధానంలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు..
ఇక గత ఏడాది 'అర్జున్ సురవరం' సినిమాతో ఆకట్టుకున్న హీరో నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టాడు .. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానంటూ తన అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చాడు.
పల్లవి వర్మతో పెళ్లి
భీమవరం అమ్మాయి పల్లవి వర్మతో హీరో నిఖిల్ వివాహం త్వరలో జరగనుంది. ఇప్పటికే నిఖిల్ కి పల్లవికి గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఏప్రిల్ 16 న వీరికి హైదరాబాద్ లో వివాహం జరగనుంది.