లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాడు నిఖిల్ అర్జున్ సురవరం .. తమిళ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అసలు విడుదలవుతుందా అన్న అనుమానలు అందరిలోనూ కలిగాయి. కానీ ఎట్టకేలకు నవంబర్ 29న విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో మంచి కథ ఉండడం, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావడం సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. పక్కా మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమాకి ముందు నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచే బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద తన పరుగును ఆపేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 8.61 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ రన్లో రూ. 9.89 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూ. 21 కోట్లుగా ఉంది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.6 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సమాచారం . ఈ లెక్కన చూసుకుంటే సినిమా రూ.3.89 కోట్ల మేర లాభాన్నిదక్కించుకున్నట్టు అయింది. దీనితో ఈ సినిమా నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నిఖిల్ మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ప్రాంతాల వారీగా అర్జున్ సువరం షేర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
నైజాం - రూ. 3.70 కోట్లు
సీడెడ్ - రూ. 92 లక్షలు
ఉత్తరాంధ్ర - రూ. 1.01 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 60 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 52 లక్షలు
గుంటూరు - రూ. 70 లక్షలు
కృష్ణా - రూ. 66 లక్షలు
నెల్లూరు - రూ. 41 లక్షలు
ఏపీ, టీఎస్ క్లోజింగ్ కలెక్షన్ - రూ. 8.16 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 61 లక్షలు
ఓవర్సీస్ - రూ. 61 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ - రూ. 9.89 కోట్లు