ప్రభాస్ తో పెళ్లి.. నిహారిక స్పందన ఇది!
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. కానీ అవి అవాస్తావమే అని తేలినప్పటికీ ఆ వార్తలకి ఇంకా బ్రేక్ పడడం లేదు. తాజగా ఆ లిస్టు లోకి ఇప్పుడు మెగా డాటర్ కూడా చేరిపోయింది. ప్రభాస్ తో నిహారిక పెళ్లి అంటూ తాజాగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుండడంతో దీనిపైన నిహారిక స్పందించింది.
ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. దీనితో షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సెలబ్రిటీలు కరోనా పై సోషల్ మీడియాలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ తమ అభిమానులతో చిట్‌చాట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించిన నిహారిక ప్రభాస్ తో ప్రేమ, పెళ్లిపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి స్పందించింది. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నేను ప్రభాస్‌ను లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం నిజం కాదు అంటూ చెప్పుకొచ్చింది.
మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక.. ఒక మనసు,హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.. అటు ప్రభాస్ కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.